Kranthi Kumar Mungamuri
అగ్రకుల
మతోన్మాదులు
మీ ఒంటి
మీద మిగిల్చిన
కుల
వ్యతిరేక గుర్తులను
చూపించండి….
వచ్చి ఈ…
ప్రపంచానికి చెప్పండి
వచ్చి ఈ…
అణగారిన
ప్రపంచ సమాజానికి చెప్పండి…
వచ్చి ఈ…
అణగద్రోక్కుతున్న
మనువాద
నవతరానికి చెప్పండి…
ఈచోటనే…
మా
నాలుకలని
తెగ్గోసారని !
అది
బహుజన
విముక్తి
నినాదాలను
పలుకుతుందని !
ఈ చోటనే…
మాసెవుల్లో
సిసాన్ని పోసారని !
మీ
బ్రాహ్మణవాద
కపట
మంత్రాలను
వింటున్నదని !
ఈచోటనే…
మా తల్లులను
చిత్రహింసలకు
గురిచేసారని !
ఆమే…
అగ్రకుల
భరతమాతను
ప్రశ్నిస్తుందని !
ఈ చోటనే…
మీ
ఈ అగ్రకుల
ఆధిపత్యానికి..
ఎదురు
తిరుగుతున్నందుకు…
నన్ను
నావాడని తగులబెట్టారని !
అందుకే చెబుతున్నా
విను…
ఓ మనువాదమా…
ఇకపై
నేను గానీ…
నాజాతి
గానీ…
నీ ముందు
తలవంచుకు
నిలబడము…
నావేళ్ళ
సంవత్సరాల
కన్నీళ్ళను…
కణకణమనే
నిప్పుకనికలుగా మార్చి
మరి
కంటానుపిల్లల్ని…
అలా
పుట్టిన నా పిల్లలకు….
అలా
పుట్టిన నా పిల్లలకు….
బహుజన
మహాపురుషుల
ఉగ్గుపాలు పోసి మరిపెంచుకుంటాను…
వాళ్ళే…
వాళ్ళే…
విప్లవ
నినాదాలను
తుటాలుగా ఎక్కుపెట్టి ,
నీ
ఈ
బ్రాహ్మణవాద
సామ్రాజ్యాన్ని
కూలగోడతారు……
నీ
ఈ
బ్రాహ్మణవాద
సామ్రాజ్యాన్ని
కూలగొడతారు…..
~~~
Kranthi Kumar Mungamuri is an Ambedkarite from Andhra Pradesh.